నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణం

by velandi.Saikiran |

ఆదివారం 21వ తేదీన జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం క‌ల్పించ‌నున్న‌ట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణం
X

దిశ, కొల్లాపూర్: ఆదివారం 21వ తేదీన జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం క‌ల్పించ‌నున్న‌ట్లు కొల్లాపూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేషయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ ను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఏసీ బస్సులు మినహాయించి మిగిలిన సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని డిపో పరిధిలోని ఆయా గ్రామాల విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Next Story