- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలసిపోయినా నిద్రపోరు.. రాత్రిళ్లు వేధించే ఈ సమస్య ఏమిటి?
ఏడీహెచ్‌డీ ఉన్నవారిలో సర్కాడియన్ రిథమ్ ఆలస్యంగా ఉండే అవకాశం ఎక్కువ. దీంతో రాత్రి సమయంలో మెదడు మరింత అలర్ట్‌గా, చురుకుగా ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : రోజంతా పనిచేసి బాగా అసిపోయినా.. రాత్రిళ్లు నిద్రపోకుండా ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు. ఒకవేళ అలా ఎవరైనా రోజుల తరబడి ఉంటున్నారంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే.. అటెన్షన్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ADHD) బాధితుల్లో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. దీనినే ‘రివెంజ్ బెడ్‌టైమ్ ప్రొక్రాస్టినేషన్’ అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో బాధితులు రాత్రిళ్లు రెండు మూడు గంటల సమయం దాటినా పడుకోకుండా మేల్కొని ఉండేందుకు ఇష్టపడతారు. పైగా ఆ సందర్భంలో కూడా ఏదోఒక పనిచేయాలని చూస్తుంటారు. ఎందుకిలా? దీనికి పరిష్కారం ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
నిపుణుల ప్రకారం.. “రివెంజ్ బెడ్‌టైమ్ ప్రాక్రాస్టినేషన్” అనేది కేవలం క్రమశిక్షణ అదుపు తప్పడం మాత్రమే కాదు. బాధిత వ్యక్తులు ఏడీహెచ్‌డీ లక్షణాలను దాచడం, నిరంతరం పని ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల, మెదడు రాత్రి సమయంలో ఒక అరుదైన “స్వేచ్ఛ”ను వెతుకుతుంది. రాత్రి పూట ఎక్కువ ఇబ్బందులు, అంతరాయాలు ఉండవు కాబట్టి ప్రశాంతంగా, తక్కువ ఒత్తిడితో ఉంటుంది. ఈ సమయంలో బాధిత వ్యక్తులు లేట్‌నైట్ వరకు మేల్కొని ఉండటానికి, పగలు మిగిలిపోయిన పనులను, నచ్చిన ఇతర పనులను చేయడానికి ఇష్టపడుతుంటారు.
ఏడీహెచ్‌డీ (ADHD) ఉన్నవారిలో సర్కాడియన్ రిథమ్ (శరీర గడియారం) ఆలస్యంగా ఉండే అవకాశం ఎక్కువ. దీంతో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మెదడు మరింత అలర్ట్‌గా, చురుకుగా ఉంటుంది. స్క్రోలింగ్, గేమింగ్ వంటి డొపమైన్ ఇచ్చే యాక్టివిటీస్ బాధిత వ్యక్తులకు రాత్రి సమయాన్ని “తన సమయం”గా మార్చేస్తాయి. ఫలితంగా తాత్కాలిక ఉపశమనం కోసం నిద్రను త్యాగం చేసే పరిస్థితి(cycle of sacrificing sleep) ఏర్పడుతుంది.
మానసిక సమస్యలు
రివెంజ్ బెడ్‌టైమ్ ప్రాక్రాస్టినేషన్(Revenge Bedtime Procrastination) వల్ల దీర్ఘకాలిక నిద్రలోపం, అలసట, ఆందోళన, చిరాకు, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత సమస్యలు వంటివి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. క్రానిక్ స్ట్రెస్ పెరగడంవల్ల భావోద్వేగాలను నియంత్రించడం కష్టమవుతుంది. పనిలో ఉత్పాదకత తగ్గుతుంది. రోజువారీ కార్యకలాపాలు దెబ్బతింటాయి.
శారీరక సమస్యలు
దీర్ఘకాలిక నిద్రలోపం వల్ల రక్తపోటు పెరగడం, గుండె సమస్యలు, డయాబెటిస్, ఊబకాయం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తే చాన్స్ ఎక్కువ. అంతేకాకుండా రోజువారీ అలసట పెరిగి, ఇమ్యూనిటీ తగ్గి తరచుగా అనారోగ్యాలు దాడిచేస్తాయి. ఈ మానసిక స్థితి తరచుగా పునరావృతం కావడం కొనసాగితే.. నిద్ర సమస్యలు మరింత తీవ్రమై ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చు. అందుకే ఈ సమస్యను గుర్తించిన వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
పరిష్కారం ఏమిటి?
రివెంజ్ బెడ్‌టైమ్ ప్రాక్రాస్టినేషన్‌ను అధిగమించాలంటే రోజువారీ అలవాట్లలో మార్పు చేసుకోవాలి. రాత్రిపూట పనులు చేయడం కాకుండా.. వాటిని పగటిపూటనే పూర్తిచేసేలా ప్రయత్నించాలి. రోజులో 20-30 నిమిషాలైనా మీకు నచ్చిన పనులు (స్క్రోలింగ్, సీరియల్, హాబీ) చేసుకోవడానికి సమయం కేటాయించండి. దీనివల్ల మానసిక ఆనందం కలిగి, మానసిక స్థితి మెరుగు పడుతుంది. క్రమంగా ఏడీహెచ్‌డీ నుంచి బయటప పడటానికి కారణం అవుతుంది. అలాగే పని మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఇక రాత్రిపూట నిద్రకు భంగం కలిగించే వాటికి దూరంగా ఉండటం బెటర్. గంట ముందు స్క్రీన్ ఆఫ్ చేయడం లేదా బ్లూ లైట్ ఫిల్టర్ వాడండి. పుస్తకం చదవడం వంటివి చేయాలి. మార్పురాకపోతే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






