- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా..
మున్సిపాలిటీ పరిధిలో గత నెల మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కొండంత అండగా నిలిచింది.

దిశ, ఖమ్మం రూరల్: మున్సిపాలిటీ పరిధిలో గత నెల మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కొండంత అండగా నిలిచింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు ఏదులాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శనివారం బాధిత కుటుంబాలను నేరుగా కలిసి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 44 కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.10,000 చొప్పున నగదును పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తమను ఆదుకునేందుకు మంత్రి పొంగులేటి, ట్రస్ట్ ప్రతినిధులు ముందుకు రావడంపై బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏదులాపురం మున్సిపాలిటీ అధ్యక్షుడు బానోత్ కిశోర్, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మీర అశోక్ నాయక్, గోనె భుజంగ రెడ్డి, వెంపటి రవి, వీరా రెడ్డి, మహేష్, భద్రకాళి, నూకల రామ్ మోహన్ రెడ్డి, రంజిత్ నాయక్, వెంకట నారాయణ, సాయి, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.






