- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్..!
మిర్యాలగూడలో ఇటీవల సంచలనం సృష్టించిన గ్యాస్ పేలుడు ఘటన కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నట్లు సమాచారం.

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడలో ఇటీవల సంచలనం సృష్టించిన గ్యాస్ పేలుడు ఘటన కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నట్లు సమాచారం. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించిన ఈ కేసులో ముగ్గురు మృతులు హత్యకు గురై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి శ్రీకాళహస్తికి చెందిన శిరీష్ కుమార్ అనే కార్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మాట్రిమోని ద్వారా మిర్యాలగూడకు చెందిన నక్క ధనలక్ష్మితో పరిచయం ఏర్పడిన శిరీష్ కుమార్, 2023లో నరసరావుపేటలో వివాహం చేసుకున్నట్లు సమాచారం.
అనంతరం ఇద్దరూ హైదరాబాద్‌లో కూడా నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొంతకాలంగా భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ధనలక్ష్మి అతనికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మిర్యాలగూడకు వచ్చిన శిరీష్ కుమార్, ధనలక్ష్మి అదే ఇంట్లో ఉందని భావించి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా సమయంలో ఇంట్లో ఉన్న వనం చంద్రకళతో పాటు పిల్లలు లక్ష్మణ్, ప్రణతి మృతి చెందగా, ఈ ఘటన వెనుక ఉద్దేశపూర్వక చర్య ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. నిందితుడి పై గతంలో కూడా కొన్ని కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తివాస్తవాలు పోలీసుల అధికారిక ప్రకటన అనంతరం మాత్రమే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.






