- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన రైతులకు ఉచిత వరి విత్తనాలు పంపిణీ
మంత్రి సీతక్క సహాకారంతో మండలంలోని అకినేపల్లి మల్లారం, బండారుగూడెం గ్రామాలకు చెందిన గిరిజన పేద రైతులకు వివేక రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాలు పంపిణీ చేసినట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివ రెడ్డి తెలిపారు.

దిశ, మంగపేట: మంత్రి సీతక్క సహాకారంతో మండలంలోని అకినేపల్లి మల్లారం, బండారుగూడెం గ్రామాలకు చెందిన గిరిజన పేద రైతులకు వివేక రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాలు పంపిణీ చేసినట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలోని సంఘం కార్యాలయంలో రబీ సీజన్‌లో వ్యవసాయ శాఖ సూచించిన ఏడు సన్న రకాలలోని బిపిటి-5204 సాంబమసూరి సన్నరకం విత్తనాలు అందజేసినట్లు తెలిపారు.
అన్నపూర్ణ సీడ్స్ అండ్ ఫామ్స్ యజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి సహకారంతో మూడు వందల ఎకరాలకు ఉచితంగా రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో వివేక రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులకు జనతా భీమా సౌకర్యాన్ని కల్పించడంతోపాటు వ్యవసాయ ఉపకరణాలైన బ్యాటరీ స్ప్రేయర్స్, టార్పాలిన్ పరదాలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మంగపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాలలోని ఉద్యమ్ సర్టిఫికెట్ పొందిన నిరుద్యోగ యువతకు దాల్ మిల్లులను సబ్సిడీ పై పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సాంబశివ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రైతులు సోయం చెన్నారావు, కుర్సం శ్రీను, సోయం సత్యం, మాలమహానాడు అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్, వివేకా రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






