సాగు పనులను అడ్డుకుంటే ఊరుకోం.. ఎమ్మెల్యే కోవలక్ష్మి

by Batti.Sumithra |

సర్వే పేరుతో రైతుల సాగు పనులను అడ్డుకుంటే ఊరుకోబోమని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఫారెస్ట్ అధికారులను హెచ్చరించారు.

సాగు పనులను అడ్డుకుంటే ఊరుకోం.. ఎమ్మెల్యే కోవలక్ష్మి
X

దిశ, ఆసిఫాబాద్ : సర్వే పేరుతో రైతుల సాగు పనులను అడ్డుకుంటే ఊరుకోబోమని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఫారెస్ట్ అధికారులను హెచ్చరించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లాలోని కెరమెరి, జైనూర్, సిర్పూర్ యు, లింగపూర్ గ్రామాలకు చెందిన పోడు రైతులు డీఎఫ్ వో కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. ధర్నాకు మద్దతుగా ఎమ్మెల్యే కూర్చున్నారు. మా భూములు మాకు కావాలి, మా భూములను లాక్కోవద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న గిరిజన. ఆదివాసీ రైతుల భూములను లాక్కుంటే.

ఉపాధి కోల్పోయి రైతుల కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. సర్వేకి ఇది సమయమా.. ఎండాకాలం ఏం చేశారని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారుల పనితీరు పై అసహనం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరగనివ్వను అని, సర్వే పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని. విత్తనాలు వేసుకునే సీజన్‌లో ఆటంకాలు కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోడు రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని లక్షలాది ఎకరాలకు పట్టాలు ఇచ్చామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Next Story