లివింగ్ రిలేషన్‌కు అడ్డొచ్చారని కుటుంబాన్ని హతమార్చిన యువతి

by Ramesh Naini |

బెంగళూరులోని సీగేహళ్లి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. లివింగ్ రిలేషన్‌ను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఓ యువతి తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రులు, చెల్లిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

లివింగ్ రిలేషన్‌కు అడ్డొచ్చారని కుటుంబాన్ని హతమార్చిన యువతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని సీగేహళ్లి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. లివింగ్ రిలేషన్‌ను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఓ యువతి తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రులు, చెల్లిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను సోమసుందర్ (55), ముత్తులక్ష్మి (48), సుప్రియ (20)గా గుర్తించారు. నిందితులు శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్‌గా పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు శ్వేత-కెన్నెత్‌ల సహజీవన సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం రాత్రి సీగేహళ్లిలోని శ్వేత నివాసంలో వాగ్వాదం తీవ్రరూపం దాల్చగా, శ్వేత, కెన్నెత్ కలిసి తల్లిదండ్రులు, చెల్లిపై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తీవ్రంగా గాయపడిన సోమసుందర్ అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు వచ్చి సహాయం కోరగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణానికి ముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. శ్వేత తీసుకున్నట్లు చెబుతున్న రూ.30 లక్షల రుణాల వ్యవహారం కూడా హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story