హారర్ సినిమాతో వచ్చేస్తున్న ఇమ్రాన్ హష్మీ.. టైటిల్ పోస్టర్‌తో భారీ హైప్

by Chukka Sudharani |

భారతీయ చిత్ర పరిశ్రమలో హారర్ జానర్‌లో అత్యంత సుపరిచితమైన ముఖాల్లో ఒకటిగా తనను తాను నిరూపించుకున్నారు ఇమ్రాన్ హష్మీ.

హారర్ సినిమాతో వచ్చేస్తున్న ఇమ్రాన్ హష్మీ.. టైటిల్ పోస్టర్‌తో భారీ హైప్
X

దిశ, సినిమా: హారర్ జానర్‌లోకి తిరిగి వస్తున్నాడు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ. భారతీయ చిత్ర పరిశ్రమలో హారర్ జానర్‌లో అత్యంత సుపరిచితమైన ముఖాల్లో ఒకటిగా తనను తాను నిరూపించుకున్న ఇమ్రాన్ హష్మీ.. ఇప్పుడు మరోసారి హారర్ జోనర్‌లో సినిమా ప్రకటించడంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా టైటిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఒక వినూత్నమైన మ్యూజికల్ హారర్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీకి 'రూహ్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇమ్రాన్ హష్మీ ఒక అద్దం ముందు నిలబడి చూసుకుంటుండగా.. మొదట నార్మల్ కళ్లు కనిపిస్తూనే ఇంతలో పూర్తిగా బ్లాక్‌గా మారిపోయిన కళ్లు చూపిస్తారు. ప్రజెంట్ ఈ వీడియో హారర్ ప్రేమికులను థ్రిల్ చేస్తుంది.

కాగా.. ప్రైమ్ వీడియో యొక్క ప్రశంసలు పొందిన బ్రీత్ ఫ్రాంచైజీ సృష్టికర్త దర్శకుడు మయాంక్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ‘లపచ్ఛపి, ఛోరీ చిత్రాలతో పేరుగాంచిన మయాంక్ శర్మ, విశాల్ కపూర్ దీనికి కథ అందించారు. విక్రమ్ ఖక్కర్, సన్నీ ఖన్నా నిర్మిస్తున్నారు. ఈ రూహ్ చిత్రం 2027లో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపారు.

Next Story