సాఫ్ట్ బేస్‌బాల్ వరల్డ్‌కప్‌కు జిల్లా విద్యార్థిని ఎంపిక

by Batti.Sumithra |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి దుర్గం శైనిశ్రీ సెప్టెంబర్‌లో శ్రీలంకలో జరిగే వరల్డ్‌కప్ సాఫ్ట్ బేస్‌బాల్ పోటీలకు ఎంపికైంది.

సాఫ్ట్ బేస్‌బాల్ వరల్డ్‌కప్‌కు జిల్లా విద్యార్థిని ఎంపిక
X

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి దుర్గం శైనిశ్రీ సెప్టెంబర్‌లో శ్రీలంకలో జరిగే వరల్డ్‌కప్ సాఫ్ట్ బేస్‌బాల్ పోటీలకు ఎంపికైంది. కాగజ్‌నగర్ మండలంలోని వంజీరి గ్రామానికి చెందిన శైనిశ్రీ ప్రస్తుతం గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇప్పటికే నేపాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సాఫ్ట్ బేస్‌బాల్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన ఆమె, మహారాష్ట్రలోని సతారాలో జరిగిన పోటీల్లో రజత పతకం గెలుచుకుని వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. అయితే ఆమె తండ్రి ఆటో డ్రైవర్ కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది. దీంతో శ్రీలంకలో జరిగే వరల్డ్‌కప్ పోటీల్లో పాల్గొనడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించి శైనిశ్రీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు తోడ్పాటు అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story