- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఉచితంగా రూ.1.20 కోట్ల జీవిత బీమా
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ప్రిమియంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా ‘ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్'ను ప్రభుత్వం తీసుకురానుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ బంపరాఫర్ ప్రకటించింది. వారి భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ ఎలాంటి ప్రీమియం భారం లేకుండానే భారీ ఆర్థిక రక్షణ కల్పించేందుకు సరికొత్త పథకాన్ని తీసుకురానుంది. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం రూ.1.20 కోట్ల చొప్పున భారీ బీమా సదుపాయాన్ని కల్పించేందుకు ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (Employees' Life Insurance Scheme)ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈనెల 25న సీఎం చేతుల మీదుగా ప్రారంభం
అయితే, ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈనెల 25న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందే ఉద్యోగులు, పెన్షనర్లు తమ జేబుల నుంచి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి, పెన్షనర్ సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదవశాత్తు (Accidental Death) మృతిచెందినా రూ.1.20 కోట్ల బీమా పరిహారం వారి కుటుంబానికి అందనుంది. ఈ భారీ బీమా పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఖాతాలు ఉన్న అన్ని ప్రముఖ బ్యాంకులతో ఎంవోయూలు కూడా కుదుర్చుకోనుంది. దీంతో మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల కుటుంబాలకు క్లెయిమ్ సొమ్ము వేగంగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.






