ఇథనాల్ పెట్రోల్‌పై అబద్ధాలు ప్రచారం.. సోషల్ మీడియా పోస్టులపై కేంద్రం సీరియస్

by Kema Shiva Kumar |

ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ (E20) పై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

ఇథనాల్ పెట్రోల్‌పై అబద్ధాలు ప్రచారం.. సోషల్ మీడియా పోస్టులపై కేంద్రం సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP)పై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న తప్పుడు ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇథనాల్ ఇంధనంపై ప్రజలను గందరగోళానికి గురిచేసేలా, తప్పుదోవ పట్టించేలా కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

పాత వీడియోలతో హల్‌చల్..

సోషల్ మీడియా (Social Media)లో ప్యూస్‌ను పెంచుకోవడం కోసం, లేని సంచనాలను సృష్టించడం కోసం కొందరు పాత చిత్రాలు, వీడియోలను మళ్లీ మళ్లీ సర్క్యులేట్ చేస్తున్నారని కేంద్ర పేర్కొంది. ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనంపై కొందరు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వాటిని నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది పూర్తిగా శాస్త్రీయంగా నిరూపితమైందని, దీనిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, 2003లోనే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు కేంద్రం గుర్తుచేసింది. ఆటోమొబైల్ సాంకేతిక సన్నద్ధత, సంబంధిత వర్గాల సంప్రదింపుల ఆధారంగా దశలవారీగా అమలు చేస్తూ.. 2023 నుంచి దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ (E20) ఇంధన సరఫరాను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.



Next Story