చరణ్ కు నేషనల్ అవార్డ్! : చిరంజీవి

by Muthe.Rajitha |

రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

చరణ్ కు నేషనల్ అవార్డ్! : చిరంజీవి
X

దిశ, వెబ్ డెస్క్ : రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన "పెద్ది" సక్సెస్ మీట్ లో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇందులో రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు నేషనల్ వచ్చినా రాకపోయినా ఏం బాధ లేదని, ఇంతమంది ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే పెద్ద అవార్డు అన్నారు. చరణ్ ఎదుగుదల చూస్తుంటే తండ్రిగా చాలా గర్భంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన లైఫ్ నే మార్చేసిన సినిమా ఇదని, గత చిత్రాల కంటే ఎక్కువ పేరు తీసుకు వచ్చిందని అన్నారు. ఇపుడు అందరూ తనను రామ్ చరణ్ గా కంటె పెద్దగా గుర్తు పెట్టుకున్నారని, తన కూతురు క్లీంకార కూడా తనను పెద్దిగానే గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. గుండెల్లో నిలిచిపోయే హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు రామ్ చరణ్. కాగా బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా ఇటీవల విడుదలైన పెద్ది సినిమా బాక్సాఫీసు వద్ద మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొని విజయం సాధించింది.

Next Story