- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతని చేతులకు విద్యార్థుల రక్తం.. ధర్మేంద్ర ప్రధాన్‌పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు!
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పేపర్ లీకేజీలు, సీబీఎస్ఈ మార్కుల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పేపర్ లీకేజీలు, సీబీఎస్ఈ మార్కుల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ, విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు నాల్గవ రోజుకు చేరి మరింత ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులను ఉద్దేశించి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘వీరు ఉగ్రవాదుల బి-టీమ్, దేశాన్ని విభజించే శక్తులు’ అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై విద్యార్థి లోకం భగ్గుమంది. మంత్రి వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యాయమైన డిమాండ్లతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులతో పోల్చడం అత్యంత సిగ్గుచేటని, నీట్ అవకతవకల వల్ల మనస్తాపానికి గురై దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన 17 మంది అమాయక విద్యార్థుల మరణాలకు మంత్రే ప్రత్యక్ష బాధ్యుడని ధ్వజమెత్తారు.
"మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతులకు ఆ 17 మంది విద్యార్థుల రక్తం అంటింది" అంటూ దిప్కే సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నిరసనను సరికొత్త పంథాలోకి తీసుకెళ్తూ సీజేపీ ఆధ్వర్యంలో వినూత్నంగా ‘డైపర్ డొనేషన్ డ్రైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘రోజుకో డైపర్.. లీకేజీలను దూరంగా ఉంచుతుంది’ అనే నినాదంతో జంతర్ మంతర్ వద్దకు వచ్చే ప్రతి నిరసనకారుడు ఒక డైపర్‌ను తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైన విద్యాశాఖ మంత్రికి బుద్ధి వచ్చేలా ఆ డైపర్లపై ‘మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి’ అనే డిమాండ్లను వ్రాసి సేకరిస్తున్నామని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఈ డైపర్లన్నింటినీ నేరుగా విద్యాశాఖ మంత్రి కార్యాలయానికే పార్సిల్ చేసి పంపిస్తామని హెచ్చరించిన నిరసనకారులు.. మంత్రి తన పదవి నుంచి తప్పుకునే వరకు ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.






