- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన ఫోటోల పిచ్చి.. గోవా బాగా బీచ్‌లో యువకుడు గల్లంతు
గోవాలో ఫోటోల పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. స్నేహితులతో ట్రిప్ కు వెళ్లిన యువకుడు సరదాగా గడపకుండా ఫోటోల కోసం బీచ్ లోని ఓ రాయిపై కూర్చుని ఫోటోలు దిగే ప్రయత్నం చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: గోవాలో ఫోటోల పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. స్నేహితులతో ట్రిప్ కు వెళ్లిన యువకుడు సరదాగా గడపకుండా ఫోటోల కోసం బీచ్ లోని ఓ రాయిపై కూర్చుని ఫోటోలు దిగే ప్రయత్నం చేశాడు. అప్పటికే సముద్రంలోని అలలు ఎగిసిపడగా అవి మరింత దూసుకువచ్చాయి. దీంతో రాయిపై కూర్చున్న యువకుడు సముద్రంలో పడిపోయాడు. ఒడ్డుకురావాలని ఎంత ప్రయత్నించినా అలలు అతడిని ముంచేశాయి. దీంతో బయటకు రాలేక సముద్రపు నీటిలోనే గల్లంతయ్యాడు.
ఈ ఘటన బాగా బీచ్ లో చోటు చేసుకుంది. యువకుడిని కర్నాటక రాష్ట్రం బీజాపూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మాన్ సూన్ కావడంతో అలల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల యువకుడు కొట్టుకుపోయినట్టు కనిపిస్తోంది. యువకుడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు నిర్దారించారు. ప్రస్తుతం మాన్ సూన్ సీజన్ కావడంతో అలల తాకిడి ఎక్కువగా ఉంటుందని సముద్రం ఎప్పుడు ఎలా ఉప్పొంగుతుందో తెలియదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బీచ్ కు వచ్చినవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.






