డ్రగ్స్ రహిత నిజామాబాద్ మన అందరి లక్ష్యం

by Ratna Kumari |

మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే సామాజిక శాపమని, వాటి నిర్మూలనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య పిలుపునిచ్చారు.

డ్రగ్స్ రహిత నిజామాబాద్ మన అందరి లక్ష్యం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే సామాజిక శాపమని, వాటి నిర్మూలనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య పిలుపునిచ్చారు. ఈనెల 22 నుండి 26 వరకు జిల్లావ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన పై చేపడుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం బోధన్ లోని మోడల్ హైస్కూల్ ‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్తును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.400 కోట్లను ఖర్చు చేస్తోందని సీపీ తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ‌కు లేదా డయల్ ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1908 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సీపీ సాయిచైతన్య హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో నిజామాబాద్ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

Next Story