ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసిన సమంత.. ఇక సినిమాలకు బ్రేక్

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ అందాల‌తార స‌మంత అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. మా ఇంటి బంగారం సినిమా థాంక్యూ మీట్‌లో సమంత మాట్లాడుతూ..తాను మళ్లీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటున్నానని ఫ్యాన్స్ క్షమించాలని అన్నారు.

ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసిన సమంత.. ఇక సినిమాలకు బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అందాల‌తార స‌మంత అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. మా ఇంటి బంగారం సినిమా థాంక్యూ మీట్‌లో సమంత మాట్లాడుతూ..తాను మళ్లీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటున్నానని ఫ్యాన్స్ క్షమించాలని అన్నారు. మెటర్నిటీ లీవ్స్ కోసం తాను కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో సమంత నటనపై ప్రశంసలు అందుతున్నాయి.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లోనే సమంత బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సమంత ప్రెగ్నెన్సీతో ఉందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు సమంత ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేశారు. ప్రెగ్నెన్సీ గురించి చెబుతున్న సమయంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు కనిపించింది. పక్కనే తన భర్త రాజ్ నిడమూరు కూడా కూర్చుని ఉండగా ఆయన సైతం మురిసిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, ప్రేక్షకులు సమంతకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story