వైభవ్ తమ్ముడూ చిచ్చర పిడుగే.. సూర్యవంశీ పోస్టు వైరల్

by Harish |

క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లకే భారత జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు.

వైభవ్ తమ్ముడూ చిచ్చర పిడుగే.. సూర్యవంశీ పోస్టు వైరల్
X

దిశ, స్పోర్ట్స్ : వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న 15 ఏళ్ల కుర్రాడు. ఐపీఎల్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి 15 ఏళ్లకే ఏకంగా టీమిండియా నుంచి పిలుపు అందుకున్నాడు. వైభవే కాదు అతని తమ్ముడు కూడా చిచ్చరపిడుగే. బుధవారం బిహార్‌లో జరిగిన ఓ లోకల్ మ్యాచ్‌లో 10 ఏళ్ల ఆశీర్వాద్ సూర్యవంశీ సెంచరీ బాది వార్తల్లో నిలిచాడు. ‘రిషవ్ 11’ జట్టుకు ఆడిన అతను అదిరే ప్రదర్శన చేశాడు. ‘రౌషన్ 11’తో ఆడిన మ్యాచ్‌లో 119బంతుల్లో 168 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతని మెరుపులతో ‘రిషవ్ 11’ జట్టు 40 ఓవర్లలో 311/7 స్కోరు చేసింది. తన తమ్ముడి ప్రదర్శనను తెలియజేస్తూ వైభవ్ సోషల్ మీడియాలో ఫోటో పెట్టాడు. దీంతో ఆ పోస్టు వైరల్‌గా మారగా.. వైభవ్‌లాగే అతని తమ్ముడూ చిచ్చరపిడుగేనని ప్రశంసిస్తున్నారు. త్వరలోనే ఆశీర్వాద్ కూడా ఐపీఎల్ ఇస్తాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ గేముకు ముందు కూడా ఆశీర్వాద్ బిహార్‌లో జరిగిన మ్యాచ్‌లో తేజ్‌పూర్ క్రికెట్ అకాడమీ తరపున ఆడి శతకం బాదాడు. 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. కాగా వైభవ్‌‌కు అన్న ఉజ్వల్, తమ్ముడు ఆశీర్వాద్ ఉన్నారు.


Next Story