IRFC: ఐఆర్ఎఫ్‌సీలో వాటా అమ్మకానికి కేంద్రం సిద్ధం

by S Gopi |   (  Updated:2026-06-23 17:04:45  IST  )

ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం ద్వారా మొదట 1 శాతం వాటాను మార్కెట్లోకి తీసుకురానుండగా, పెట్టుబడిదారుల నుంచి మంచి డిమాండ్ వస్తే అదనంగా మరో 1 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది.

IRFC: ఐఆర్ఎఫ్‌సీలో వాటా అమ్మకానికి కేంద్రం సిద్ధం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెట్టుబడుల ఉపసంహరణ (డిస్ఇన్వెస్ట్‌మెంట్)ను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ)లో గరిష్టంగా 2 శాతం వరకు వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం ద్వారా మొదట 1 శాతం వాటాను మార్కెట్లోకి తీసుకురానుండగా, పెట్టుబడిదారుల నుంచి మంచి డిమాండ్ వస్తే అదనంగా మరో 1 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది. ఈ ఆఫర్ బుధవారం నాన్-రిటైల్ పెట్టుబడిదారులకు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిస్ఇన్వెస్ట్‌మెంట్, ఆస్తుల నగదీకరణ ద్వారా రూ. 80,000 కోట్ల ఆదాయం సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. గత ఫిబ్రవరిలో ఐఆర్ఎఫ్‌సీలో 4 శాతం వరకు వాటాను విక్రయించాలని ప్రయత్నించిన ప్రభుత్వం 1.71 శాతం వాటా మాత్రమే విక్రయించగలిగింది. ప్రస్తుతం సంస్థలో కేంద్ర ప్రభుత్వ వాటా 84.65 శాతంగా ఉండగా, తాజా ఓఎఫ్ఎస్ ద్వారా వాటా మరింత తగ్గనుంది.

Next Story