వీధి కుక్క దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

by Ratna Kumari |

వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన రాజంపేట మండలంలోని తలమడ్ల గ్రామంలో చోటుచేసుకుంది.

వీధి కుక్క దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
X

దిశ, రాజంపేట్ : వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన రాజంపేట మండలంలోని తలమడ్ల గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తాళ్ల నరేష్ కుమారుడు వరుణ్ తేజ్(10), తలారి స్వామి కూతురు నందిని(09) మంగళవారం సాయంత్రం ఇంటి ముందర ఆడుకుంటున్నగా.. ఒక్కసారిగా వీధి కుక్క వారిపై దాడి చేసి గాయపరిచి,కుక్కను తరమడానికి వచ్చిన వ్యక్తిని గాయపరిచి అటుగా బైక్ పై వెళుతున్న మరో వ్యక్తిని ఘోరంగా గాయపరిచింది. మండలంలోని గ్రామాలలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని,చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయన్నారు.ఇటీవల రాజంపేటలో మరియు శివాయిపల్లి గ్రామాల్లో కుక్కలు దాడి చేసి చిన్నారులను తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవక ముందే తాజాగా ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు వ్యక్తులపై వీధి కుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామంలో వీధి కుక్కల దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని... అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story