- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుగుల మందు తాగిన వివాహిత మృతి
వేధింపులు తాళలేక మనస్థాపంతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

దిశ, మరిపెడ : వేధింపులు తాళలేక మనస్థాపంతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహాన్ పురం గ్రామంలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై గండ్రాతి సతీష్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎనకుంట తండా గ్రామానికి చెందిన కేలోతు శిరీష(35) కేలోతు వీరన్న దంపతులు కౌలు రైతులుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహాన్ పురం గ్రామంలో ఓ రైతు వద్ద భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వీరి గెట్టుకు ఆనుకొని బురహాన్పురం గ్రామానికి చెందిన జంపల్లి బాలకృష్ణ వ్యవసాయ భూమి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ పనులకు వచ్చిన కేలోతు శిరీషను పక్క రైతు బాలకృష్ణ గడచిన ఆరు నెలలుగా తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని శిరీష భర్త ఆరోపించాడు.
ఈ ఆరోపణ నేపథ్యంలోనే గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పలు మార్లు పంచాయితీ చేసినట్లు సమాచారం. అయినా కూడా సదరు బాలకృష్ణ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మరోమారు కే లోతు వీరన్న గ్రామ పెద్దమనుషులకు విషయం తెలియజేశారు. దీంతో కోపోద్రిక్తులైన జంపల్లి బాలకృష్ణ, అతడి భార్య జంపెల్లి విజయ, ఇద్దరు కుమారులు ఈ నెల 16వ తేదీన వ్యవసాయ క్షేత్రం వద్ద కేలోతు శిరీషను దుర్భాషలాడుతూ దూషించారు. ఈ క్రమంలోనే అదే రోజు సాయంత్రం శిరీష వ్యవసాయ క్షేత్రం వద్ద పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుల పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతురాలి భర్త వీరన్న ఫిర్యాదు మేరకు సదరు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త ఇద్దరు కుమారులు ఓ కుమార్తె కలరు.






