టీజీ ఈసెట్ 2026 మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి!

by Ajay Maddhiboyina |

టీజీఈసెట్ మొదటి విడత ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల వెబ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. డిప్లొమా, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ కౌన్సెలింగ్ వివరాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, కన్వీనర్ ఎ. శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.

టీజీ ఈసెట్ 2026 మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఈసెట్ మొదటి విడత ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల వెబ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. డిప్లొమా, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ కౌన్సెలింగ్ వివరాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, కన్వీనర్ ఎ. శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈసెట్ పరీక్షలో మొత్తం 17,768 మంది అర్హత సాధించగా 11,576 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. అందులో 11,172 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేయగా, మొత్తం 3,56,192 ఆప్షన్లు వచ్చాయి. అందుబాటులో ఉన్న 14,890 సీట్లకు గానూ, మొదటివిడతలో 8,829 (59 శాతం) సీట్లు కేటాయించారు. అలాగే ఈడబ్లూఎస్ కోటా కింద 460 మందికి సీట్లు లభించాయి. స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా సీట్లను తుది విడత కౌన్సెలింగ్‌లో కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజును జూన్ 27 లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ https://tgecet.nic.in లో సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టం ద్వారా జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్ తీసుకోవాలి. ఫీజు చెల్లించకపోయినా, సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోయినా సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. జూన్ 27 లోపు సీటును ఆన్‌లైన్‌లో రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు తిరిగి చెల్లిస్తారు. తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత జూలై 10 నుండి జూలై 13 లోపు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.విద్యార్థులు ఆన్‌లైన్‌లో, కాలేజీలో యాంటీ డ్రగ్ అఫిడవిట్ డిక్లరేషన్‌ను సమర్పించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

సీట్ల కేటాయింపు వివరాలు (మొదటి విడత):

కాలేజీ అందుబాటులో సీట్లు భర్తీఅయినవి భర్తీ శాతం

ఇంజనీరింగ్ 168 13,610 8799 65

ఫార్మసీ 123 1280 30 59

మొత్తం 14890 8829 59

Next Story