Gold: దిగొస్తున్న పసిడి రేట్లు

by S Gopi |   (  Updated:2026-06-23 15:45:47  IST  )

దేశీయ స్పాట్ మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Gold: దిగొస్తున్న పసిడి రేట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు దేశీయ మార్కెట్లో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్టు డెలివరీకి సంబంధించిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,446 తగ్గి రూ. 1,46,672 వద్ద ముగిసింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా ధరలు విపరీతంగా పెరగడంతో స్థానిక జ్యువెలరీ దుకాణాలలో రిటైల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు కొత్తగా బంగారం కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ఊపు తగ్గడంతో, విక్రేతలు ధరలను తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 3,380 క్షీణించి రూ. 1,44,600కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల పసిడి రూ. 3,100 తగ్గి రూ. 1,32,550 వద్ద ఉంది. వెండి రూ. 5 వేలు తగ్గడంతో కిలో రూ. 2.45 లక్షలుగా ఉంది. స్థానిక మార్కెట్‌లో డిమాండ్ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా వస్తున్న బలహీనమైన సంకేతాలు దేశీయ రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా దిగిరావడానికి బలమైన కారణాలుగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 1.51 శాతం తగ్గి, ఔన్స్‌కు 4,126.77 డాలర్లకు పడిపోయింది.

Next Story