- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఘాతంతో ఆరు పాడి గేదెల మృతి
మిర్యాలగూడ మండలం తక్కెలపాడు గ్రామ పరిధిలోని బండ మీది గూడెంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ మండలం తక్కెలపాడు గ్రామ పరిధిలోని బండ మీది గూడెంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గాలి దుమారం కారణంగా విద్యుత్ లైన్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, తెగిపడిన విద్యుత్ వైర్లు మేతకు వెళ్లిన పాడి గేదెలకు తగలడంతో ఆరు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గ్రామానికి చెందిన నారబోయిన అంజయ్యకు, నారబోయిన వెంకయ్యకు చెందిన గేదెలతో పాటు తక్కెలపాడు తండాకు చెందిన భారతి, మరో ఇద్దరికి చెందిన పాడి గేదెలు మేత కోసం వెళ్లగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా సంభవించిన ఈ ఘటనతో పశువుల యజమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పాడి గేదెల మృతితో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఘటన సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించినట్లు తెలిసింది.






