రెబ్బెనలో సాదా బైనామాలకు భారీ షాక్.. 863లో 800 తిరస్కరణ !

by Batti.Sumithra |   (  Updated:2026-06-23 15:11:54  IST  )

రెబ్బెన మండల పరిధిలో సాదా బైనామాలకు సంబంధించి అందిన 863 దరఖాస్తుల్లో 800 అనర్హంగా తేలినట్లు తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు.

రెబ్బెనలో సాదా బైనామాలకు భారీ షాక్.. 863లో 800 తిరస్కరణ !
X

దిశ, రెబ్బెన : రెబ్బెన మండల పరిధిలో సాదా బైనామాలకు సంబంధించి అందిన 863 దరఖాస్తుల్లో 800 అనర్హంగా తేలినట్లు తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్దేశించిన నిబంధనల మేరకు చేపట్టిన పరిశీలనలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లావణి పట్టాలు, సీలింగ్ భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలు నమోదవడం, అమ్మకందారుల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో అందుబాటులో లేకపోవడం, అవసరమైన ఆధారాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఆయా దరఖాస్తులు అర్హత సాధించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం 63 దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయని తెలిపారు. వాటికి సంబంధించిన భూ వివరాలు, సంబంధిత రికార్డులను క్షేత్రస్థాయిలో ధ్రువీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సౌమ్య, ఉదయ్ ఆధ్వర్యంలో, జీపీఓల సహకారంతో గ్రామాల వారీగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి తుది నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తహసీల్దార్ సూర్యప్రకాశ్ వెల్లడించారు.

Next Story