- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యం తో మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ స్వామి మృతి
అనారోగ్యం తో మృతి చెందిన మాజీ రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు, చేవెళ్ల సీనియర్ నేత పడాల వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించిన శాసన మండలి ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరమర్శించారు.

దిశ, చేవెళ్ల : అనారోగ్యం తో మృతి చెందిన మాజీ రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు, చేవెళ్ల సీనియర్ నేత పడాల వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించిన శాసన మండలి ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. వెంకటస్వామి మరణ వార్త తెలిసిన వెంటనే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి వెళ్లి ఆయన పార్థీవ దేహంపై పుష్ప గుచ్చాలతో నివాళులర్పించిన మహేందర్ రెడ్డి, వెంకటస్వామితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని, ఆయన కుమారులు ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులను ఓదార్చి, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు .ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. చేవెళ్ల ప్రాంతం మంచి నేతను కోల్పోయిందని మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాయకులు పలుగుట్ట జనార్దన్ రెడ్డి, మొయినాబాద్ మాజీ జెడ్పిటిసి కాలే శ్రీకాంత్, షాబాద్ దర్శన్, రామేశ్వర్ రెడ్డి , ప్రతాపరెడ్డి, రామచంద్రయ్య గౌడ్ తదితరులు ఆయనతో ఉన్నారు.






