- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
180 కిలోల ప్లాస్టిక్ సీజ్
పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగారెడ్డి రీజియన్ ఏఈ వీరేశం తెలిపారు.

దిశ, రాజేంద్రనగర్ : పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగారెడ్డి రీజియన్ ఏఈ వీరేశం తెలిపారు. అత్తాపూర్ సర్కిల్ పరిధిలో పలు కిరాణా షాపుల్లో, షాపింగ్ మాల్స్ లలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులతో కలిసి దాడులు నిర్వహించారు. సుమారు 180 కిలోల సింగల్ యూస్ కవర్లను సీజ్ చేసి జిహెచ్ఎంసి కి అప్పగించారు. సింగల్ యూస్ వినియోగం, సరఫరా, విక్రయంపై పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను తయారుచేసే పరిశ్రమలు తప్పనిసరిగా పీసీబీ నుండి రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేని తయారీ యూనిట్లపై రూ. 50,000 నుండి లక్షల రూపాయల వరకు జరిమానాలు విధిస్తారని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలు, దుకాణాలపై భారీ జరిమానాలు, లైసెన్సుల రద్దు వంటి చర్యలు తీసుకుంటామన్నారు.
పిసిబి అధికారుల దాడులను గుర్తించి ముందుగానే మూసివేసిన పరిశ్రమలు ..
కాటేదాన్ పారిశ్రామిక వాడలో దాదాపు 100 వరకు లైసెన్స్ లేని క్యారీ బ్యాగ్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా క్యారీ బ్యాగులు తయారు చేస్తూ పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్న పరిశ్రమలపై దాడులు చేసేందుకు వచ్చిన అధికారుల రాకను గుర్తించిన పరిశ్రమల యజమానులు ముందుగానే తమ పరిశ్రమలను మూసివేసుకున్నారు. పిసిబి అధికారుల దాడులు నిరంతరం కొనసాగిస్తే తప్ప ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టలేమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






