- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్త కదలదు.. మురుగు పారదు
డోంగ్లి మండల కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. మురికి కాలువలు చెత్తతో నిండిపోయి మురుగునీరు పారక రోడ్లపైకి వస్తోంది.

దిశ,డోంగ్లి, (మద్నూర్) : డోంగ్లి మండల కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. మురికి కాలువలు చెత్తతో నిండిపోయి మురుగునీరు పారక రోడ్లపైకి వస్తోంది. నీటి కుండీలు పాకురు పట్టి దోమలకు ఆవాసాలుగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది.
ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన కాలువ ..
డోంగ్లి ప్రధాన రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువ మొత్తం ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఇతర చెత్తతో నిండిపోయింది. మురుగునీరు పారే దారి లేక నిల్వ ఉండిపోవడంతో దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి అంటురోగాల భయం వెంటాడుతోంది. కాలువలు శుభ్రం చేయకపోవడంతో వానాకాలంలో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాకురు పట్టిన నీటి కుండీ..
మండల కేంద్రంలో నిర్మించిన సిమెంట్ నీటి కుండీ నిరుపయోగంగా మారింది. నీరు నిల్వ ఉండి పాకురు పట్టి, పచ్చగా మారింది. చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచి పాములు, కీటకాలకు ఆవాసంగా మారింది. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఈ కుండీలు శుభ్రం చేయకపోవడంతో పశువులు సైతం నీరు తాగలేని దుస్థితి నెలకొంది.
అధికారుల నిర్లక్ష్యం ..
డోంగ్లి గ్రామ పంచాయతీ సిబ్బంది వారానికోసారి కూడా కాలువలు శుభ్రం చేయడం లేదని, చెత్త సేకరణ వాహనం సక్రమంగా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. స్వచ్ఛ భారత్ పేరుకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా కొన్ని రోజుల క్రితమే కాలువలు శుభ్రం చేశాం. ప్రజలు చెత్తను కాలువల్లో వేయడంతో మళ్లీ పూడిక పేరుకుపోతోంది. త్వరలోనే ఇంకా పూడిక తీస్తాం. నీటి కుండీలను కూడా శుభ్రం చేయిస్తాం అని తెలిపారు.






