​గ్యాస్ వినియోగదారులకు అలర్ట్

by velandi.Saikiran |

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులందరూ ఈ నెల 30వ తేదీ లోగా తమ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) ఒక ప్రకటనలో ఆదేశించారు.

​గ్యాస్ వినియోగదారులకు అలర్ట్
X

​దిశ, హుజురాబాద్ రూరల్: జిల్లాలోని గృహ అవసరాల ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులందరూ ఈ నెల 30వ తేదీ లోగా తమ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) ఒక ప్రకటనలో ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం... డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఫర్ ఎల్.పి.జి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాల పరిధిలోకి వచ్చే వినియోగదారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్పష్టం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నాయి.​ జూన్ 30, 2026 లోగా బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

​ఎవరికి వర్తిస్తుంది?

ఎల్పీజీ కనెక్షన్ పొందినప్పటి నుండి ఇప్పటి వరకు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ చేయించుకోని గృహ వినియోగదారులందరూ దీనిని పూర్తి చేయాలి​ సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలలో గానీ లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా గానీ ఈ కె వై సి ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. (30.06.2026) లోపు గ్యాస్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ ఈ కె వై సి ని పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.

Next Story