- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్ లో నకిలీ వైద్యుడు...ఆ ఇంజక్షన్లు వేస్తూ
మేడ్చల్‌లో నకిలీ వైద్యుడి బండారం బట్టబయలైంది.

దిశ, మేడ్చల్ : మేడ్చల్‌లో నకిలీ వైద్యుడి బండారం బట్టబయలైంది. ఎలాంటి వైద్య అర్హతలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పెంటయ్య అనే వ్యక్తిని కుత్బుల్లాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు అరెస్టు చేశారు. మేడ్చల్ పట్టణంలోని “శివరామకృష్ణ డే కేర్ సెంటర్” పేరిట అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న అతడు, ఓ మహిళా వైద్యురాలి ధ్రువపత్రాలను ఉపయోగిస్తూ క్లినిక్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
సంతానం లేమితో బాధపడుతున్న దంపతులకు ప్రత్యేక ఇంజెక్షన్లు ఇస్తే, గర్భం దాల్చుతారని నమ్మబలుకుతూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన SOT పోలీసులు, ఇద్దరు రోగులకు చికిత్స చేస్తున్న సమయంలోనే పెంటయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండానే క్లినిక్ నిర్వహించడంతో పాటు అదే ప్రాంగణంలో మెడికల్ షాప్ కూడా నడుపుతున్నట్లు బయటపడింది.
నిబంధనలకు విరుద్ధంగా మందులు నిల్వ చేయడం, వైద్య పరికరాలను వినియోగించడం వంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఉమాగౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి అక్రమ కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని, నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.






