- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు చోరీ...సీటు చోరీ...బీజేపీ సిద్దాంతం
స్పెషల్ ఇంటన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) విధానంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు రాజకీయాలకు తేరలేపిందని, ఓట్ల తొలగింపుతో ఓటు చోరీ...సీటు చోరీకి పాల్పడుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ విమర్శించారు

దిశ, అందోల్ : స్పెషల్ ఇంటన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) విధానంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు రాజకీయాలకు తేరలేపిందని, ఓట్ల తొలగింపుతో ఓటు చోరీ...సీటు చోరీకి పాల్పడుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం పరిధిలోని సంగుపేటలోని లక్ష్మిదేవి గార్డెన్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ పై బీఎల్‌ఏలకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆమె ప్రసంగిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ 2002లోనూ చేపట్టారని, అప్పట్లో దేశంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలన్న ఉద్దేశ్యంతో చేపడితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని ఆమె అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనేనని ఆమె అన్నారు. బెంగాల్‌లో కేంద్రం కొత్త విధానాలకు తేరలేపారని, ఓటు హక్కు లేని వారికి రేషన్ బియ్యం కట్‌చేస్తున్నారని, వారికి రక్షణ లేకుండా పోయిందన్నారు. బెంగాల్ రాష్ట్రంలో 30 లక్షల ఓట్లను తొలగించడం మమతా బెనర్జీ ఓటమికి కారణమైందని ఆమె అన్నారు. 2028లో ఎన్నికలుంటే ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటి నుంచే ఓటరు జాబితాను సిద్దం చేస్తుందన్నారు. ఓటు చోరీతో పాటు సీటు చోరీకి పాల్పడిందని, మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ స్థానానికి తాను వేసిన నామినేషన్‌ను ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై నామినేషన్‌ను తిరస్కరించి సీటు చోరీకి పాల్పడిందని ఆమె విమర్శించారు. దేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బూత్ లెవెల్ ఏజేంట్‌లు అప్రమత్తంగా ఉండి, ప్రతి ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆమె కొరారు. జిల్లా కాంగ్రేస్ అధ్యక్షురాలు నిర్మల, కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, రాంమోహన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావద్, ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఫయీం, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, పీసీసీ ఉపాధ్యాక్షుడు సంగమేశ్వర్, మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్‌లు ఎస్.కృష్ణారెడ్డి, ఎ.చిట్టిబాబు, పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంచార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్, మార్కెట్‌కమిటీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి, మాజీ చైర్మన్ మల్లయ్య, సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, ఎస్.సురేందర్‌గౌడ్, గజ్జాడ కిషన్, కౌన్సిలర్‌లు పి.శ్రీనివాస్, రేఖా ప్రవీణ్, గడ్డం అరుణ్‌కుమార్, మర్రి అరుణ కుమారీ, రాజశేఖర్, కొ అప్షన్ సభ్యుడు ప్రవీణ్‌కుమార్, ఆత్మ కమిటి డైరెక్టర్ చిట్యాల మధు, మాజీ కౌన్సిలర్ లు రంగ సురేష్, నాని నాగరాజ్, దుర్గేష్, లక్ష్మణ్, ప్రవీణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని బదానం చేయడమే బీఆర్‌ఎస్ లక్ష్యం: పీసీసీ అధ్యక్షుడు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప మరో పార్టీకి స్థానం లేదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీదే విజయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలికిచ్చిన వాగ్థానాలలో 70 శాతం నేరవేర్చామని, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ వంటి ఇతరత్రా వాటిని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని బదానం చేయడమే ప్రధాన లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అక్రమాలు, అరాచకలు, భూదోపిడి, నీళ్ల దోపిడిని ప్రజలు ఇంకా మరిచిపోలేరని, బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొవడం మీ బ్రమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లను కొల్లగోట్టడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుందన్నారు. 2002లో జరిగిన ఎస్‌ఐఆర్‌లో ఓట్లను చేర్చితే, ప్రస్తుతం బీజేపీ చేపడుతున్న ఎస్‌ఐఆర్ ఓట్ల తొలగించడమే పనిగా పెట్టుకుందన్నారు. ఓట్ల తొలగింపు జరగకుండా ఓటును కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు.
ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దూ: మంత్రి దామోదర్
కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్‌ఐఆర్ విధానంతో అర్హత కలిగిన వారి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసుకునే బాధ్యత బీఎల్‌ఏ లదేనని రాష్ట్ర ౖÐð ద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 8 పర్యాయాలు స్పెషల్ ఇంటన్సివ్ రివిజన్ చేపట్టారని, కానీ ప్రస్తుతం చేపడుతున్న ఎస్‌ఐఆర్ మాత్రం భిన్నంగా ఉందన్నారు. ముఖ్యంగా నిరక్ష్యారాసులు, వయో వృద్దులు, రైతులు, వలస కూలీలు తమ ఓటు హక్కును కొల్పోయే ప్రమాదం ఉందని, అలా జరగకుండా బీఎల్‌ఏలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వారందరి ఓట్లు పోకుండా జాగ్రత్తగా ఎన్యుమరేషన్ ఫారాలను భర్తీ చేసి బీఎల్‌ఓలకు అందజేయలన్నారు. ఇ ఓటు హక్కును పొందేందుకు కొత్తగా అర్హత కలిగిన వారితో పాటు ఇప్పటి వరకు ఓట్లు వేసిన వారు కూడా ఎన్యుమరేషన్ ఫారంను తప్పనిసరిగా నింపి ఇవ్వాలన్నారు. లేనట్లయితే ఓటు హక్కును కొల్పోవాల్సి వస్తుందన్నారు. ఎస్‌ఐఆర్ విధానంపై బీఎల్‌ఏలకు అవగాహనను కలిగి ఉండాలని, ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు.






