ది ప్యారడైజ్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

by Chukka Sudharani |

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కొలాబిరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’.

ది ప్యారడైజ్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కొలాబిరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్‌లో కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా నెట్టింట వైరల్ అవుతూ ఎంతగానో ఆకట్టుకోగా.. సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ది ప్యారడైజ్ మూవీని ఆగస్టు 21న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ రీసెంట్‌గా రాఘవ్ జూయెల్ పాత్రను పరిచయం చేస్తూ వదిలిన లుక్ పోస్టర్‌లో సినిమా రిలీజ్ డేట్ లేకపోవడంతో వాయిదా పడినట్లు అర్థం అయింది. దీంతో ఈ సినిమా ఇంకెప్పుడు విడుదల అవుతుందని అందరిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ది ప్యారడైజ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు ‘ది ప్యారడైజ్ ఫస్ట్ హాఫ్ రెడీ అయిందట.. ఇంట్రో నుంచి ఇంటర్వెల్ వరకూ అదిపోనుందట.. అలాగే సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.

Next Story