- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఝలక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
నటుడు ప్రకాశ్‌రాజ్‌కు బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj)కు ఊహించని షాక్ తగలింది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉండకూడదనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కేసులోనే ఆయనపై తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2019లో దిలీప్ కుమార్ (Dilip Kumar) అనే లాయర్ ప్రకాష్‌రాజ్‌కు ఒకే సమయంలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని స్పష్టమైన ఆధారాలు సంపాదించాడు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశ్‌రాజ్‌కు ఓటు హక్కు ఉందని ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని బెంగళూరు హలసూరు గేటు పోలీస్‌స్టేషన్‌లో దిలీప్ కుమార్ లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.
కాగా, ఇదే అంశంపై బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో సదరు న్యాయవాది బెంగళూరు కోర్టును ఆశ్రయించగా.. ప్రకాశ్‌రాజ్‌ను వెంటనే విచారణకు హాజరు కావాలంటూ పలుసార్లు నోటీసులు జారీ చేసింది. అయినా, కోర్టు నోటీసులను పట్టించుకోకుండా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రకాష్‌రాజ్ వరుసగా విచారణలకు గైర్హాజరతుండటంతో ఇవాళ అతడిపై ధర్మాసనం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.






