- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పామాయిల్ రైతులకు అలర్ట్.. రైతులకు ఉద్యాన శాఖ కీలక సూచనలు
ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు పామాయిల్ రైతులు ముందుగానే యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నష్టాన్ని నివారించుకోవచ్చని వైరా డివిజన్ ఉద్యానవన అధికారి వేణు రైతులకు సూచించారు.

దిశ, ఏన్కూరు : ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు పామాయిల్ రైతులు ముందుగానే యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నష్టాన్ని నివారించుకోవచ్చని వైరా డివిజన్ ఉద్యానవన అధికారి వేణు రైతులకు సూచించారు. మంగళవారం ఏన్కూరులో గాలివాన బీభత్సం వల్ల నష్టపోయిన పామాయిల్ తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. పూర్తిగా పడిపోయిన మొక్కలను జాగ్రత్తగా లేపి, మళ్లీ గొయ్యి తీసి నాటాలని, అలా చేస్తే అవి తిరిగి పెరుగుతాయని తెలిపారు. అలాగే సగం పడిపోయిన మొక్కలను లేపకుండా, ముందుగా మట్టలను తొలగించి, అనంతరం మొదలు దగ్గర మట్టిని నెట్టాలని సూచించారు.
అదేవిధంగా వంగిన వైపు వచ్చే గెలలను ఎప్పటికప్పుడు తొలగించాలని చెప్పారు. కొత్తగా పామాయిల్ మొక్కలను నాటే రైతులు నాటే సమయంలోనే ఎక్కువ లోతులో నాటాలని సూచించారు. దక్షిణ, పడమర దిశల్లో వెదురు, సర్వి, జామాయిల్ మొక్కలను నాటడం వల్ల గాలి తీవ్రత సగానికి తగ్గుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు ఎండిన మట్టలను తొలగిస్తూ, చెట్ల చుట్టూ ఎక్కువ ఎత్తులో మట్టి పోయడం వల్ల మొక్కలకు గాలులను తట్టుకునే శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. పామాయిల్ తోటలు సాధారణంగా గంటకు 90 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయని అన్నారు.






