IRCTCలో కీలక పరిణామం.. చైర్మన్, ఎండీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ రాజీనామా

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-23 13:49:19  IST  )

ఐఆర్‌సీటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ ఇవాళ తన పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు.

IRCTCలో కీలక పరిణామం.. చైర్మన్, ఎండీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) సంజయ్ కుమార్ జైన్ (Sanjay Kumar Jain) తన పదవికి ఇవాళ హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన తన పదవీ కాలం ముగియడానికి ముందే వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 990 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) అధికారి అయిన సంజయ్ కుమార్ జైన్, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఐఆర్‌సీటీసీ పూర్తి స్థాయి సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన ఉత్తర రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌తో పాటు పలు కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. జూలై 20 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి వచ్చింది.

త్వరలో తాత్కాలిక చీఫ్ నియామకం..

కాగా, సంజయ్ కుమార్ జైన్ ఊహించని విధంగా తప్పుకోవడంతో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఐఆర్‌సీటీసీ రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు గాను, త్వరలోనే ఓ తాత్కాలిక చీఫ్‌ను నియమించేందుకు రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది. అనంతరం పూర్తి స్థాయి సీఎండీ ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Next Story