- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్టర్ జూపల్లి.. చర్చకు ఎక్కడికి రమ్మంటావో చెప్పు? మాజీ మంత్రి హరీశ్ రావు చాలెంజ్
పంట బోనస్, రైతు బంధుపై మంత్రి జూపల్లి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మేమిచ్చిన పంట బోనస్ మూడు రైతు బంధులకు సమానం అంటూ మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ జూపల్లి.. మీరు ఇచ్చిన పంట బోనస్ రూ.3000 కోట్లయితే.. ఎగ్గొట్టిన రైతు బంధు విలువ రూ.29,000 కోట్లు. బోనస్ ఎగ్గొట్టిందే కాకుండా మేమిచ్చిన బోనస్ మూడు రైతు బందులకు సమానం అంటావా? నీ చిన్న మెదడు చిక్కిపోయిందా? ఓ సారి లెక్క తెలుసుకో. ఎక్కడ చర్చ పెడుతావో చెప్పు.. నేను వచ్చి నిరూపిస్తానని చాలెంజ్ చేశారు. ఇవాళ అశ్వారావుపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు.
దేనికోసం ఆశీర్వదించాలి?:
రాములవారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి అని ఆయనకు దేవుడంటే భయం లేదన్నారు. ఈ నెల 30వ తేదీన మధిరకు సీఎం వస్తాడంట. రైతు ఆశీర్వాద సభ పెడుతాడు అంట. ప్రజలు అందరు ఆశీర్వదించండి అని భట్టి అంటున్నారు. ఎందుకు ఆశీర్వదించాలి? రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినందుకా? రైతు భీమా ఆపేసినందుకా? లేక రైతు రుణమాఫీ మీద మాట తప్పినందుకా? అని ప్రశ్నించారు. రైతులకు యూరియా దొరకకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాప్‍ల పేరుతో టైం పాస్ చేస్తోందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోయలకు, లంబాడాలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా లోన్లు ఇయ్యలేదు? ఒక్కరికి కూడా ఒక రూపాయి సాయం అందించలేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో 5400 కోట్లు పెట్టినం అని చెప్పారు.. కానీ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి రిలీజ్ చేయలే.. ఎస్సీలకు ఒక్క రూపాయి సాయం చేయలేని విమర్శించారు. ముగ్గురు మంత్రులున్నా ఈ ఖమ్మం జిల్లాకు జరిగింది గుండు సున్నా అని సీతారామ ప్రాజెక్ట్ పనులు జరుగుతలేవు. అశ్వారావుపేటలో 100 పడకల ఆసుపత్రి ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు.
స్కాములు తప్ప స్కీములు లేవు:
రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, మున్సిపల్ శాఖ మంత్రిగా ఫెయిల్, హోంశాఖ మంత్రిగా ఫెయిల్.. మూడు శాఖలు ఫెయిల్ అయినా ఢిల్లీకి మూటలు మోసే శాఖలో మాత్రం పాస్ అయ్యిండు. తన కుర్చీని కాపాడుకోవడానికి కష్టపడుతున్నాన్నారు. పోలీసుల దౌర్జన్యం ఎక్కవయ్యింది. మనం అధికారంలో ఉన్నప్పుడు పని పని తప్ప ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని, ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఏనాడూ అనుకోలేదు. BRS కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు రాసి పెట్టుకోండి ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారని మా కార్యకర్తల మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టిన, ఒక్క దెబ్బ కొట్టిన అంతకు అంత అనుభవిస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఒక్కటే. గ్రామాల్లో చర్చ పెట్టండి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని అర్ధం అయ్యేలా చెప్పాలన్నారు. గెలుపు ఓటములు సహజం.. ఓడిపోతే ఇంట్లో కుర్చున్నామా..? ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాము. ప్రజల కోసం నిల్చున్నామన్నారు. రేవంత్ రెడ్డి BRS కు ప్రతిపక్ష హోదా రాదు అంటున్నాడు.. నిజమే కదా మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు వస్తది. పాలకపక్ష హోదా వస్తది. ప్రజలు BRS వైపు చూస్తున్నారన్నారన్నారు. రేవంత్ పాలనంతా స్కాములే. స్కీములు మాత్రం లేవని విమర్శించారు.






