- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల్లో గెలుపోటములు సహజం
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని పాఠంగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు.

దిశ, జహీరాబాద్ : రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని పాఠంగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. ఓటమితో నిరుత్సాహానికి గురై ఆగిపోతే విజయం ఎప్పటికీ వరించదని పేర్కొన్నారు. మంగళవారం జహీరాబాద్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన 18వ వార్డు అభ్యర్థి నసీర్, 21వ వార్డు అభ్యర్థి సిఫలియా-శ్యామ్, 22వ వార్డు అభ్యర్థి ముర్తుజాలతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆయా వార్డుల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తంజిం, యువ నాయకులు కొనింటి మిథున్ రాజ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






