VIRAL: నగరంలో ఆసక్తికర ఘటన.. భర్త అఫైర్ బ్రేక్ అవ్వాలని ఆలయంలో పూజలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-23 13:19:22  IST  )

నగరంలోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో ఓ భార్యామణి వింత పూజలు చేసింది.

VIRAL: నగరంలో ఆసక్తికర ఘటన.. భర్త అఫైర్ బ్రేక్ అవ్వాలని ఆలయంలో పూజలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో చిత్రవిచిత్ర ఘటనకు వేదిక అవుతోంది. తన భర్త దారి తప్పి వేరే మహిళతో పెట్టుకున్న ఇల్లీగల్ అఫైర్ (Illicit Relationship) తెగిపోవాలని, భర్త తిరిగి తన వద్దకే రావాలని కోరుతూ ఓ భార్య గుడిలో చేసిన వింత పూజలు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆలయానికి వచ్చిన ఓ మహిళ ఎవ్వరూ గమనించని సమయంలో ఓ పక్క కూర్చుని వింత పూజలు చేయడం ప్రారంభించింది. తన భర్తకు, మరో మహిళకు ఉన్న వివాహేతర సంబంధం శాశ్వతంగా తెగదెంపులు అవ్వాలనే కోరికతో ఆమె పూజలు చేసింది. అందుకోసం సదరు మహిళ తన భర్త ఫొటో, ఆ రెండో మహిళ ఫొటోలతో పాటు ఒక తాడు, పసుపు, కుంకుమలు, పూజా సామగ్రిని పెట్టుకుని వింతగా పూజలు నిర్వహించింది.

భక్తుల్లో చేతబడి భయం.. రంగంలోకి సిబ్బంది

అయితే, మామూలుగా అమ్మవారి ఆలయాల్లో ఇలాంటి పూజలు అరుదు. దీంతో అక్కడ మహిళ చేస్తున్న పూజను చూసి ఆలయానికి వచ్చిన ఇతర భక్తులు ఏదో చేతబడి, క్షుద్రపూజలు జరుగుతున్నాయేమోనని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భక్తుల ద్వారా సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఆ మహిళను గట్టిగా మందలించి అక్కడి నుంచి పంపేశారు. ప్రస్తుతం పూజలకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story