- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆహార ఆవిష్కరణలు వినియోగదారుల అభిరుచుల మేరకే జరగాలి : మల్లు భట్టి విక్రమార్క
ఆహార, పానీయాల ఆవిష్కరణలు వినియోగదారుల అభిరుచుల మేరకే జరగాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, హిమాయత్‌నగర్ : ఆహార, పానీయాల ఆవిష్కరణలు వినియోగదారుల అభిరుచుల మేరకే జరగాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజులపాటు జరిగే 'ఫుడ్ ఎఫెయిర్ 2026' ప్రదర్శన ప్రారంభించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రదర్శన నిర్వాహకులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క 'ఫుడ్ ఎఫెయిర్ 2026' ప్రదర్శన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆహార తయారీదారులు, ప్రాసెసర్లు, ఆతిథ్యరంగ నిపుణులు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక భాగస్వాములు ఒకచోట చేరి ఆహార, అనుబంధ రంగాల్లోని సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు.
ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పారిశ్రామిక వృద్ధి, వ్యవస్థాపకత, పెట్టుబడులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీకాంత్ పూనాటి, కె.కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఆహార ఆవిష్కరణ, సుస్థిరత, వృద్ధి ప్రయాణంలో ఈ 'ఫుడ్ ఎఫెయిర్ 2026' ప్రదర్శనలు వ్యూహాత్మక మైలురాళ్లుగా నిలుస్తాయన్నారు. దక్షిణ భారతదేశ ఆహార, పానీయాలు, అనుబంధ పరిశ్రమల ప్రదర్శనకు ముఖద్వార వాణిజ్య ప్రదర్శన అయిన 'ఫుడ్ ఎఫెయిర్ 2026' జూలై 2, 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతుందని తెలిపారు.






