అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం

by Ajay Maddhiboyina |

డా. బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీ.జీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయినట్లు యూనివర్శిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: డా. బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీ.జీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయినట్లు యూనివర్శిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, పీజీ లో ఎంఏ( తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజ శాస్త్రం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్), ఎంకాం, ఎమ్మెస్సీ(వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, గణితశాస్త్రం, అనువర్తిత గణితశాస్త్రం కోర్సులు), ఎంఎల్ఐఎస్సి, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్ లు జరుగుతున్నాయి. ఆయా కోర్సులకు విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలు www.braouonline.in, www.braou.ac.in లో పొందొచ్చని అధికారులు వెల్లడించారు.

డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత, లేదా పదో తరగతి తర్వాత ఏదేనీ రెండు సంవత్సరాల కోర్సు, డిప్లొమా, ఐటిఐ, పాలిటెక్నిక్, ఓపెన్ స్కూల్ లో ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా కోర్సుల్లో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును ఆగష్టు 7వ తేదీ లోపు ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570, 040-23680222 / 333 / 555 ఫోన్ నెంబర్ లలో టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు.

Next Story