- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, రాజేంద్రనగర్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి దుర్గ కన్వెన్షన్ లో టిపిసిసి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై రాజేంద్రనగర్ నియోజకవర్గం స్థాయి అవగాహన, శిక్షణ శిబిరం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు,బూత్ లెవల్ ఏజెంట్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డైరీ కార్పోరేషన్ కార్పోరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి సమగ్ర శిక్షణ అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు. ఓటరు నమోదు, మార్పులు చేర్పుల ప్రక్రియలో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, ప్రతి ఇంటిలో ఉన్న ఓటర్ల వివరాలను సమగ్రంగా తెలుసుకుని ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త, ప్రజాప్రతినిధి చురుగ్గా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సెక్రటరీలు ముంగి జైపాల్ రెడ్డి, సానేం శ్రీనివాస్ గౌడ్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనిత, మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్, ధనంజయ్, ప్రేమ్ గౌడ్, సరికొండ వెంకటేష్, తలారి మల్లేష్, బండారి శంకర్, రణధీర్ రెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






