ఎన్సీఏపీపై వర్క్ షాపు.. హాజరైన ఈపీటీఆర్ఐ, రాంకీ, మెక్లీన్, ఇగ్జోరా ప్రతినిధులు

by Ajay Maddhiboyina |

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాయలంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ఫ్రొగ్రాం(ఎన్సీఏపీ), ఘన వ్యర్థాల నిబంధనలు, సీ అండ్ డీ వేస్ట్ నిబంధనలపై వర్క్ షాపు నిర్వహించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(శానిటేషన్) రవికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఈపీటీఆర్ఐ, రాంకీ, మెక్లీన్, ఇగ్జోరా, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు.

ఎన్సీఏపీపై వర్క్ షాపు.. హాజరైన ఈపీటీఆర్ఐ, రాంకీ, మెక్లీన్, ఇగ్జోరా ప్రతినిధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాయలంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ఫ్రొగ్రాం(ఎన్సీఏపీ), ఘన వ్యర్థాల నిబంధనలు, సీ అండ్ డీ వేస్ట్ నిబంధనలపై వర్క్ షాపు నిర్వహించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(శానిటేషన్) రవికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఈపీటీఆర్ఐ, రాంకీ, మెక్లీన్, ఇగ్జోరా, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు స్థితిని సర్కిల్ వారీగా సమీక్షించారు. శానిటేషన్ విభాగ సిబ్బంది ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా విధులు నిర్వర్తిస్తూ కృషి చేసిన విషయాన్ని ప్రశంసించారు. సుప్రీంకోర్టు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఎస్‌డబ్ల్యూ‌ఎం నిబంధనలు–2026, సీ & డీ వ్యర్థాల నిబంధనలు అమలు, వాటిలోని శిక్షా నిబంధనలపై చర్చించారు.

స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపడుతున్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ మరియు వాట్సాప్ ద్వారా అందుతున్న జీహెచ్‌ఎంసీ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ కార్మికులలో ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) హాజరు నమోదు శాతాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఈ-వేస్ట్ సేకరణ, పెద్ద గృహోపకరణాల సేకరణ, దివైన్ కలెక్షన్ విధానాలు మరియు వాటి శాస్త్రీయ పారవేత పద్ధతులపై చర్చించారు. సంస్థాగత భవనాలు, వాణిజ్య భవనాలు మరియు నివాస భవనాల వారీగా బల్క్ గార్బేజ్ జనరేటర్ల నమోదు చేపట్టాలని, నివాస ప్రాంతాల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.

Next Story