- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా జలాలపై కర్ణాటక దూకుడు.. కేంద్రం మౌనం: మాజీ మంత్రి
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమ లేదని.. నీటి వివాదాలు పరిష్కరించడంలో విఫలమైందని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమ లేదని.. నీటి వివాదాలు పరిష్కరించడంలో విఫలమైందని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర నుంచి 30 వేల ఎకరాలకు సాగు నీరు రావడం లేదని, ఏ ధైర్యంతో ఆర్డీఎస్‌పై కర్ణాటక ప్రభుత్వం రిజర్వాయర్లు కడుతున్నదని ప్రశ్నించారు. కృష్ణా నదిపై మరో మూడు బ్యారేజీలకు కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదని, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించిందని అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే జూన్, జూలైలో సైతం కృష్ణాకు నీళ్లు రావని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జూరాలకు నీళ్లు రావడం లేదన్నారు. పాలమూరును శాశ్వతంగా కరువు జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మరోసారి ఆర్డీఎస్‌పై పాదయాత్ర చేస్తామని, పాలమూరు ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. కేఆర్ఎంబీ పర్మిషన్ లేకుండా కర్ణాటక ప్రభుత్వం బ్యారేజీలు కడుతున్నదని, పాలమూరు ప్రమాదంలో ఉందని తెలిపారు. కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఎట్లా ఆపాలో తెలుసని, అవసరమైతే బద్దలు కొడుతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి ఎన్‌వోసీ ఇచ్చి పాలమూరు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.






