- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ నేతపై హత్యాయత్నం
తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. తాడిపత్రి పీఎస్ దగ్గర కొంతమంది కేశవరెడ్డిపై దాడి చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. తాడిపత్రి పీఎస్ దగ్గర కొంతమంది కేశవరెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రి వద్ద కూడా కేశవరెడ్డిపై దాడి జరిగింది. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఆస్పత్రి వద్ద గొడవ జరిగింది. కేతిరెడ్డి, జేపీ వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద ఓ స్పార్పియో వాహనం ధ్వంసం అయ్యింది. ఆస్పత్రి అద్దాలను సైతం ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే తాడిపత్రిలో జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో తమను కేతిరెడ్డి ఇబ్బంది పెట్టాడని, తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డాడని జేసీ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేతిరెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలో వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






