- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెరుచుకున్న హర్మూజ్ జలసంధి.. భారత్‌కు వస్తున్న 11 నౌకలకు లైన్ క్లియర్
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో హర్మూజ్ జలసంధి తిరిగి పూర్తిగా తెరచుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఇంధన రవాణా మార్గాల్లో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ఎట్టకేలకు తిరిగి తెరుచుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) తర్వాత ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు పున:ప్రారంభమయ్యాయి. తాజా పరిణామంతో భారత్‌కు ముడిచమురు, ఇతర సరుకులతో వస్తున్న 11 వాణిజ్య నౌకలు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటేశాయి.
అమెరికా, ఇరాన్ ఒప్పందంతో వీడిన ఉత్కంఠ
గత కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పెరిగిన తీవ్ర ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి నుంచి రవాణా పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ స్తంభించిపోవడంతో పాటు భారత్ వంటి ప్రధాన దిగుమతి దేశాలపై తీవ్ర ఒత్తిడి పడింది. తాజాగా ఇరు దేశాల దౌత్యవేత్తలు జరిపిన చర్చలు విజయవంతం అవ్వడంతో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ సమ్మతించింది. దీంతో భారత్‌కు వస్తున్న మొదటి విడత 11 కార్గో, ఆయిల్ ట్యాంకర్ నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ పరిణామం భారత ఇంధన మార్కెట్‌కు, చమురు శుద్ధి సంస్థలకు (Refineries) గొప్ప ఊరటనివ్వనుంది.






