- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు విస్తరణ పనులు...చిరు వ్యాపారికి తీవ్ర గాయాలు
by velandi.Saikiran |
కూల్చివేతల సమయంలో జరిగిన ప్రమాదంలో మిల్క్ సెంటర్‌కు చెందిన మిల్లు డ్రైవర్ జన్ను సమ్మయ్య గాయపడ్డాడు.

X
దిశ, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ లో రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో చేపడుతున్న కూల్చివేతలపై చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించినా ఎటువంటి స్పందన లభించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ కూల్చివేతల సమయంలో జరిగిన ప్రమాదంలో మిల్క్ సెంటర్‌కు చెందిన మిల్లు డ్రైవర్ జన్ను సమ్మయ్య గాయపడ్డాడు. సిమెంట్ దిమ్మె అతనిపై పడటంతో కాలు విరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జన్ను సమ్మయ్యకు తక్షణ ఆర్థిక సహాయం అందించి, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story






