మరికొన్ని గంటల్లో ఊహాగానాలకు చెక్.. తలైవార్ 173 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవార్ 173’.

మరికొన్ని గంటల్లో ఊహాగానాలకు చెక్.. తలైవార్ 173 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవార్ 173’. ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ‘ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునే ఒకే పేరు’ అంటూ ఈ సినిమా టైటిల్ జూన్ 24 ఉదయం 10గంటలకు రాబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ రివీల్ చేశారు. అయితే.. ఈ సినిమాలో రజినీకాంత్ పూర్తిస్థాయి డాక్టర్ పాత్రలో నటించనున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చెన్నైలో బాగా ప్రాచుర్యం పొందిన రూ.5 డాక్టర్ స్ఫూర్తిదాయక అంశాలను కలిగి ఈ చిత్రం ఉంటుందని, అలాగే చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్సను అందించి ప్రజల నుంచి అపారమైన ప్రశంసలు పొందిన పలువురు వైద్యుల జీవితాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని తెలుస్తుండగా.. మరికొన్ని గంటల్లో రాబోయో టైటిల్ అప్డేట్‌తో ఈ ఊహాగానాలన్నీటికి చెక్ పెట్టనున్నారు మేకర్స్. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. వెయిటింగ్ తలైవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Next Story