నీటి సంపులో పడి చిన్నారి మృతి

by velandi.Saikiran |

నీటి సంపులో పడి 15 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

నీటి సంపులో పడి చిన్నారి మృతి
X

దిశ, ఘట్కేసర్: నీటి సంపులో పడి 15 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... శివారెడ్డిగూడాలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్న సంపంగి మహేష్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మహేష్ కూతురైన 15 నెలల సంపంగి నైనిక మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆడుకుంటూ ఇంట్లో ఉన్న సంపులో పడిపోయింది. ఇంట్లో కనిపించకుండా పోయిన కుమార్తె కోసం మహేష్ వెతుకుతుండగా పాప సంపులో నీటిపై తేలుతూ కనిపించింది. దీంతో వెంటనే పాపని సంపులో నుంచి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు . అక్కడ పరీక్షించిన డాక్టర్లు, మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మహేష్ ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story