నీట్ పరీక్షా కేంద్రాల్లో దారుణాలు.. బ్రాలు, శానిటరీ ప్యాడ్లు తీయించి మరీ!

by Kema Shiva Kumar |

నీట్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినుల పట్ల భద్రతా సిబ్బంది అత్యంత అవమానకరంగా, అనాగరికంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నీట్ పరీక్షా కేంద్రాల్లో దారుణాలు.. బ్రాలు, శానిటరీ ప్యాడ్లు తీయించి మరీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా జరిగిన నీట్ (NEET) రీ-ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినుల పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునే నెపంతో భద్రతా సిబ్బంది అనాగరికంగా, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా.. యథేచ్ఛగా బాడీ ఇన్వేసివ్ ఫ్రిస్కింగ్ పాల్పడ్డారని పలువురు విద్యార్థినులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను షేర్ చేసుకోవడం కలకలం రేపుతోంది.

శానిటరీ ప్యాడ్ విప్పించి మరీ..

ఓ బాధిత విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె పీరియడ్స్ సమయంలో పరీక్షకు హాజరైంది. మెటల్ డిటెక్టర్ తనిఖీ సమయంలో సిబ్బంది ఆమెను అనుమానిస్తూ.. తను శానిటరీ ప్యాడ్ ధరించానని నిరూపించుకోవడానికి ప్యాంటును కిందికి దించి చూపించాలని బలవంతం చేశారు. పరీక్ష రాయాలనే టెన్షన్‌లో ఉన్న సదరు విద్యార్థిని ఆ అవమానాన్ని భరిస్తూనే వారు చెప్పినట్లుగా చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఘోర అనుభవం కేవలం ఒక్కరికే కాదు, దేశంలోని పలు పరీక్షా కేంద్రాల్లో వేల కొద్దీ విద్యార్థినులకు ఎదురైందని సోషల్ మీడియా కామెంట్లతో తెలుస్తోంది.

బ్రా స్ట్రిప్స్, మెటల్ హుక్స్ చెకింగ్

మరికొందరు విద్యార్థినులు తమ ఇన్నర్‌వేర్ ‘బ్రా’ మెటల్ హుక్స్ కారణంగా మెటల్ డిటెక్టర్ సౌండ్ చేసిందని, అందుకు లోనికి తీసుకెళ్లి బ్రా విప్పించి మరీ అవమానకరంగా తనిఖీలు చేశారని వాపోయారు. పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లే ముందు బాలికల పట్ల సిబ్బంది ప్రవర్తించిన ఈ అనాగరిక చర్యలు వారిని మెంటల్‌గా కుంగదీశాయని తెలుస్తోంది. పరీక్ష రాయడానికి ముందే విద్యార్థినులు తీవ్రమైన ఒత్తిడికి, మానసిక క్షోభకు గురయ్యారని తల్లిదండ్రులు ఎన్‌టీఏ(NTA)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story