అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, టిప్పర్ సీజ్

by Ratna Kumari |

అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఒక జేసీబీ, టిప్పర్ వాహనాన్ని పోలీసులు మంగళవారం సీజ్ చేశారు.

అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, టిప్పర్ సీజ్
X

దిశ కొండపాక: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఒక జేసీబీ, టిప్పర్ వాహనాన్ని పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. కుకునూర్ పల్లి ఎస్ఐ జి.బాల కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కుకునూర్ పల్లి మండలం మంగోల్ గ్రామ శివార్లలోని ప్రభుత్వ కెనాల్ వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఏఎస్ఐ వి. మధుసూదన్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తూ సదరు ప్రాంతంపై దాడి చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న డ్రైవర్లు జహంగీర్ ఆలం, బిపిన్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్ మండలం బూర్గుపల్లికి చెందిన వాహన యజమాని దేవునూరి స్వామి ఆదేశాల మేరకే ఈ మట్టిని ఇతర పొలాలకు, రోడ్డు పనులకు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. దీంతో పోలీసులు జేసీబీ (టిఎస్ 05 ఈజీ 5949), టిప్పర్ (టీజీ 36 టీ 2986) వాహనాలను సీజ్ చేశారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story