ఏలూరు జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం..11 గ్రామాల ప్రజలకు అటవీశాఖ అలర్ట్

by Ajay Maddhiboyina |

ఏలూరు జిల్లా పోల‌వ‌రం మండ‌లం పాపికొండ‌ల నేష‌న‌ల్ పార్క్ ప‌రిధిలో పెద్ద‌పులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గోదావరిలో చేపలవేట, పర్యాటక బోట్లను తాత్కాలికంగా రద్దు చేశారు.

ఏలూరు జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం..11 గ్రామాల ప్రజలకు అటవీశాఖ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా పోల‌వ‌రం మండ‌లం పాపికొండ‌ల నేష‌న‌ల్ పార్క్ ప‌రిధిలో పెద్ద‌పులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గోదావరిలో చేపలవేట, పర్యాటక బోట్లను తాత్కాలికంగా రద్దు చేశారు. పులిని పట్టుకునేందుకు మత్తుమందు, బోన్లు సిద్ధం చేశారు. ఉప్పారేల్లి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో ముంజులూరు, కోటూరుపల్లి, వీరన్నపాలెం, చింతలగూడెం సహా 11 గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని, చెరువుల వద్ద చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పశువులను ఆరుబయట కట్టేయకుండా, పాకల్లో లైట్లు వేసి ఉంచాలని సూచించారు. జిల్లాలో పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Next Story